Raja Saab: రాజా సాబ్ ప్రమోషన్స్ లేట్ కు కారణమిదే
మారుతి(maruthi) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) హీరోగా రానున్న సినిమా ది రాజా సాబ్(the raja saab). హార్రర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ వివిధ కారణాల వల్ల సినిమా పలు మార్లు వాయిదా పడింది. ఆఖరిగా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసి ఫిక్స్ చేశారు.
జనవరి 9 అంటే పెద్దగా టైమ్ లేదు. కానీ రాజా సాబ్ ప్రమోషన్స్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు మేకర్స్. అయితే దానికి కారణమేంటో ఇప్పుడు తెలుస్తోంది. చిత్ర ప్రమోషన్స్ విషయంలో ఒక్కో ఇండస్ట్రీ ఒక్కో స్టైల్ ను ఫాలో అవుతూ ఉంటుంది. టాలీవుడ్ లో రిలీజ్ కు ముందు టీజర్, సాంగ్స్, ట్రైలర్ ను మాత్రమే రిలీజ్ చేస్తే, బాలీవుడ్ లో మాత్రం సినిమా రిలీజ్ కు ముందే అన్ని సాంగ్స్ ను రిలీజ్ చేస్తారు.
ఇప్పుడు రాజా సాబ్ ఈ రెండింటి మధ్య ఇరుక్కోవడం వల్లే ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదని తెలుస్తోంది. రాజా సాబ్ నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తదానీ(anil tadani) ఈ సినిమాకు బాలీవుడ్ స్టైల్ లో ప్రమోషన్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, కానీ టాలీవుడ్ స్టైల్ లో ప్రమోషన్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఎటూ తేల్చుకోలేక రాజా సాబ్ పబ్లిసిటీ కార్యక్రమాలు ఇంకా మొదలవలేదని సమాచారం. ఇదిలా ఉంటే రాజా సాబ్ సంక్రాంతి నుంచి కూడా వాయిదా పడే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.







