Raja Saab: జాతర సాంగ్ పై రాజా సాబ్ మేకర్స్ నమ్మకం
ప్రభాస్(prabhas) హీరోగా మారుతి(maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్(the raja saab). హార్రర్ థ్రిల్లర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి రాజా సాబ్ ఎప్పుడో రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడుతూ ఆఖరికి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే సంక్రాంతికి ఎన్నో సినిమాలు రిలీజ్ కానుండగా, ఆ సినిమాలన్నీ ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టి సాంగ్స్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ లో తమ సినిమాలకు క్రేజ్ ను పెంచుకుంటుంటే రాజా సాబ్ మాత్రం ఇదిగో ఫస్ట్ సింగిల్, అదిగో ఫస్ట్ సింగిల్ అంటున్నారు తప్పించి వాటిని రిలీజ్ చేయడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరు లోపు ఫస్ట్ సింగిల్ వస్తుందంటున్నారు.
ఇదిలా ఉంటే రాజా సాబ్ మూవీలోని సాంగ్స్ పై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయని, అందులో ఓ జాతర సాంగ్ ఉందని, ఆ సాంగ్ సిల్వర్ స్క్రీన్ పై నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయమని, ఇటీవల కాలంలో ఈ రేంజ్ జాతర సాంగ్ రాలేదని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. తమన్(thaman) సంగీతం అందించిన ఈ సాంగ్ మరి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.






