రీమిక్స్‌పై రెహమాన్ ఆగ్రహం
వింటేజ్ సాంగ్స్ ను రీమిక్స్ చేసే కల్చర్ చాలా కాలం నుంచే ఉంది. ఇప్పుడీ ట్రెండ్ మరింత పెరిగింది. ఏఐ ద్వారా దివంగత గాయకుల వాయిస్‌లను వాడుకుంటూ కూడా పాత క్లాసిక్ సాంగ్స్ ను రీమిక్స్ చేస్తున్నారు. దీన్ని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. మామూలుగా దేన్నీ చాలా సున్నితంగా మాట్లాడే రెహమాన్ ఈ ట్రెండ్ విషయంలో మాత్రం తన అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు.
ముకాబులా, ఊర్వశీ లాంటి తన సాంగ్స్ ను కొన్ని రీమేక్ చేయడంపై గతంలోనే అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన రెహమాన్ తాజాగా మరోసారి ఈ ట్రెండ్ ను తప్పుబట్టారు. ఆరేళ్ల ముందు సూపర్ హిట్ అయిన సాంగ్ ను ఇప్పుడు రీమిక్స్ చేశా అని ఎలా గొప్పగా చెప్పుకోగలుగుతున్నారు? అలా చేయడం చాలా తప్పని, ఒరిజినల్ సాంగ్ ను క్రియేట్ చేసిన వారి పర్మిషన్ లేకుండా అలా ఎలా చేస్తారని ప్రశ్నించాడురు రెహమాన్.
కంపోజన్ స్టైల్ ను కాపీ కొట్టి కూడా అతనికి ఎలాంటి డబ్బు చెల్లించడం లేదని, ఫ్యూచర్ లో ఇది ఎన్నో సమస్యలను కొని తెస్తుందని దీనివల్ల నైతిక సమస్యలు ఏర్పడి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశమున్నట్లు రెహమాన్ తెలిపారు. రీమిక్స్ చేస్తున్నప్పడు కేవలం నిర్మాతల నుంచి మాత్రమే పర్మిషన్ తీసుకుంటున్నారు తప్పించి ఒరిజినల్ కంపోజర్స్ నుంచి పర్మిషన్ తీసుకోవడం లేదని ఆయన అన్నారు. అంతేకాదు తాను రీమిక్స్ చేయనని, చేసే వాళ్లను కూడా సమర్థించనని రెహమాన్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు.













