ప్రభాస్ ఫ్యాన్స్ కు రాధేశ్యామ్ ట్రీట్
రాధేశ్యామ్ నుంచి ఇప్పటి వరకు ఏ ప్రమోషనల్ మ్యాటర్ బయటక రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మంచి ఫైర్ అయిన విషయం తెలిసిందే. జులై 30న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి కనీసం గ్లింప్స్ కూడా రాకపోవడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తుంది. దీన్ని తగ్గ్గిందుకు మేకర్స్ మంచి ప్లానింగ్ తో రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
రాధే శ్యామ్ పలు భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక నుంచి వరుసగగా టీజర్లు, పాటలతో ప్రమోషన్స్ ను ఫుల్ స్పీడ్ చేసేస్తారట. ట్రైలర్ కూడా రిలీజ్ కు నెల ముందు గానే రిలీజ్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తుంది. ఏప్రిల్ లో రెండు టీజర్లు, పాటలు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తారట.
అంతేకాదు, రెండు ఇంట్రెస్టింగ్ టీజర్లు, ట్రైలర్లు రెడీ చేస్తున్నారని, వారానికి ఒక సాంగ్ చొప్పున ఏప్రిల్ మొత్తం ఫ్యాన్స్ ను ట్రీట్ ఇవ్వనుందట రాధేశ్యామ్ యూనిట్. వరుసగా 5పాటలను రిలీజ్ చేయనున్నారని, అన్నీ భాషల్లో ఒకే టైమ్ లో వీటిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, గోపీ క్రిష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్, టీ సిరీస్ లు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.













