డౌట్ లేదు.. పుష్ప పోస్ట్ పోన్ ఖాయమే!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరక్టర్ ల తర్వాతి సినిమా పుష్ప రిలీజ్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఆగస్ట్ లో సినిమాను రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ షూటింట్ లేట్ అవుతున్న కారణంగా సినిమా చెప్పిన టైమ్ కు రిలీజ్ చేయడం కష్టమేనని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే యూనిట్ లో కొంతమంది సినిమాను పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయినట్లు చెప్తున్నారు. కానీ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను ఖచ్చితంగా చెప్పిన టైమ్ కు రిలీజ్ చేసి తీరుతామని చెప్తున్నారు.
కరోనా ఎఫెక్ట్ తో పుష్ప షూటింగ్ లేట్ అవడం అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. కానీ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తయింది. సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్నా సరే సినిమా షూటింగ్ ఆపకుండా కంప్లీట్ చేయాలని సుకుమార్ డిసైడ్ అయ్యాడట. అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడట. ఈ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మరో రెండు నెలలైనా కనీసం ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి సినిమా రిలీజ్ టైమ్ కు వచ్చే ఛాన్సే లేదని అంతా అనుకుంటున్నారు.
అంతేకాదు పుష్ప షూటింగ్ ను కంప్లీట్ చేసి, ఫస్ట్ కాపీ రెడీగా పెట్టుకుని.. అప్పటి సిట్యుయేషన్స్ బట్టి రిలీజ్ చేయాలా లేదా అన్నది డిసైడ్ అవుతారట. ఇప్పటికే థియేటర్లను క్లోజ్ చేయాలని రూల్స్ పెట్టుకున్నారు కాబట్టి సినిమాను థియేటర్లకు పూర్వ వైభవం వచ్చాకే రిలీజ్ చేస్తారంటున్నారు. ప్రస్తుతానికైతే పుష్ప రిలీజ్ డేట్ మారలేదు. పరిస్థితులు అనుకూలించి అన్నీ అనుకున్నట్లుగా జరిగితే చెప్పిన టైమ్ కే పుష్ప ను థియేటర్లలో దింపడానికి చూస్తుంది పుష్ప టీమ్.













