PuriSethupathi: పూరీ సేతుపతి మూవీ లేటెస్ట్ అప్డేట్

కోలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి(vijay sethupathi). ఆయన హీరోగా తెరకెక్కిన పూరీ జగన్నాథ్(puri jagannadh) డైరెక్షన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. పూరీ సేతుపతి(Puri Sethupathi) వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. సంయుక్త మీనన్(samyuktha menon) ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
టబు(Tabu), విజయ్ కుమార్(vijay kumar), బ్రహ్మాజీ(brahmaji) కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ మూవీని పూరి కనెక్ట్స్(PUri connects), జేబీ మోషన్ పిక్చర్స్(JB Motion pictures) బ్యానర్ పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్(Charmmee Kaur), జేబీ నారాయణరావు కొండ్రోల్లా(JB Narayana rao kondrolla) నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుగుతుండగా, ఇవాళ నుంచి మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొదలైనట్టు తెలుస్తోంది.
అ షెడ్యూల్ లో పలు మేజర్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటూ క్రేజీ పాటలను కూడా తెరకెక్కించనున్నారని యూనిట్ సభ్యులంటున్నారు. యాక్షన్, ఎమోషన్ తో కలిపి పూరీ ఈ సినిమాను రూపొందించనుండగా, ఈ కథ తననెంతో ఎగ్జైట్ చేసిందని విజయ్ సేతుపతి మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక ఈ సినిమాకు యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్(Harshavardhan Rameswar) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.