Puri Jagannadh: ఆ పనిలో పూరీ బిజీ

గత కొన్నేళ్లుగా పూరీ జగన్నాథ్(Puri Jagannadh) పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన ఆఖరిగా హిట్ అందుకుంది ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) సినిమాతో. ఆ సినిమా తర్వాత పూరీ డైరెక్షన్ లో వచ్చిన లైగర్(Liger), డబుల్ ఇస్మార్ట్(Double Ismart) సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో పూరీకి నెక్ట్స్ ఎవరు ఛాన్స్ ఇస్తారా అని అనుకుంటున్న టైమ్ లో పూరీ ఓ క్రేజీ కాంబోని అనౌన్స్ చేశాడు.
తన నెక్ట్స్ మూవీని విజయ్ సేతుపతి(Vijay Sethupathi) హీరోగా అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చిన పూరీ జగన్నాథ్ ఈ ప్రాజెక్టు కోసం ప్రతీదీ చాలా క్రేజీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అనౌన్స్‌మెంట్ తోనే అందరినీ షాక్ కు గురి చేసి, సినిమాపై అంచనాలు పెంచేసిన పూరీ జగన్నాథ్, సేతుపతి లాంటి వెర్సటైల్ యాక్టర్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు ఈ సినిమా కోసం లొకేషన్స్ వేటలో ఉన్నాడని, దాని కోసం హైదరాబాద్, చెన్నైలోని పలు లొకేషన్స్ ను వెతుకుతున్నాడని తెలుస్తోంది. జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయనుండగా ఫస్ట్ షెడ్యూల్ ను పూరీ ఇప్పుడు ఫైనల్ చేసే లొకేషన్ లోనే చేస్తాడని టాక్ వినిపిస్తోంది.