నాగ్ కోసం ట్రై చేస్తున్న పూరీ
ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. ఈ సినిమా తర్వాత పూరీ ఏ హీరోతో సినిమా చేస్తాడనేది ఇంకా తెలియలేదు. డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ చూశాక ఆలోచించొచ్చని కొందరు హీరోలుంటే పూరీ మాత్రం ఈ సినిమా రిలీజ్ కు ముందే మరో ప్రాజెక్ట్ ను లాక్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో పూరీ కొన్ని వారాల కిందట కింగ్ నాగార్జునను కలిసినట్లు తెలుస్తోంది.
వీరిద్దరి కాంబో అనగానే గుర్తొచ్చే సినిమా శివమణి. మాస్ పోలీసాఫీసర్ గా పూరీ, నాగార్జునను ప్రెజెంట్ చేసిన తీరు అక్కినేని అభిమానులతో పాటూ అందరికీ నచ్చింది. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో సూపర్ అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. యావరేజ్ అనిపించుకుంది.
మంచి కథ ఉంటే నాగార్జునను ఎలా చూపించాలనేది పూరీకి చాలా బాగా తెలుసు. ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉన్న నాగ్, ఆ తర్వాత తమిళ డైరెక్టర్ తో ఓ సినిమా చేయనున్నాడు. బంగార్రాజు3 కూడా ప్లానింగ్ లో ఉంది కానీ కథ ఫైనల్ అవడం లేదు. ఇలాంటి సిట్యుయేషన్స్ లో నాగ్ పూరీకి ఓకే చెప్తాడా లేదా అన్నది చూడాలి. ఇక పూరీ విషయానికొస్తే లైగర్ చేసిన గాయాలన్నింటికీ డబుల్ ఇస్మార్ట్ తో ఆన్సర్ చెప్పాలనే రీతిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.













