Akhil Akkineni: అఖిల్ ఆ రిస్క్ చేస్తాడా?
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఇప్పటిదాకా బ్లాక్ బస్టర్ అందుకోలేదు. హలో(Hello), మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) లాంటి సినిమాలు మంచి సినిమాలొచ్చాయి కానీ అవి బ్లాక్ బస్టర్లుగా నిలవలేదు. తర్వాత ఏజెంట్ సినిమాతో పెద్ద ప్రయోగమే చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్(Agent) టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది.
దీంతో అఖిల్ కష్టమంతా బూడిదలో పోసినట్టైంది. అయితే అఖిల్ ఇప్పుడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) తో కలిసి సినిమా చేయనున్నాడని నెట్టింట వార్తలు ప్రచారం అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్ తో అఖిల్ ఎందుకు రిస్క్ చేస్తున్నాడా అని అక్కినేని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.
అయితే పూరీతో సినిమా అంటే ఏ హీరోకైనా రిస్క్ ఎంత ఉంటుందో లాభం కూడా అంతే ఉంటుంది. కెరీర్ లో ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా పూరీ తన హీరోను ప్రెజెంట్ చేస్తాడు. కరెక్ట్ కథతో వస్తే పూరీని కొట్టే కమర్షియల్ డైరెక్టర్ ఎవరూ ఉండరు. కాకపోతే ఈ మధ్య పూరీ కథల్లో సరైన కంటెంట్ ఉండటం లేదు. ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే ఈ సినిమాతో అయినా ఇద్దరూ ఫామ్ లోకి రావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.













