సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘బుజ్జి ఇలా రా’
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో గరుడవేగ అంజి తెరకెక్కిస్తున్న చిత్రం బుజ్జీ ఇలారా. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చాందిని తమిళరసన్, పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని సునీల్ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో ధన్‌రాజ్ సీఐ కేశవ్ నాయకుడుగా కనిపించనుండగా, మహమ్మద్ ఖయ్యుమ్గా సునీల్ నటిస్తున్నట్లు సృష్టత ఇచ్చారు. ప్రచార చిత్రంలో ఆయన లుక్ చాలా కొత్తగా ఉంది. ఓ విభిన్నమైన కథాంశంతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నాం. సునీల్, ధన్‌రాజ్‌ల పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి అని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి సాయి కార్తీక్ స్వరాలందిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు.













