Shankar: శంకర్ ను నమ్మలేకపోతున్న నిర్మాతలు

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్(shankar) నుంచి ఇప్పుడు అందరూ ఆశిస్తున్న సినిమాలు రావడం లేదు. శంకర్ సక్సెస్ రుచి చూసి చాలా కాలమే అయింది. ఇండియన్2(indian2) తో ఘోర పరాజయాన్ని అందుకున్న శంకర్, ఈ ఇయర్ గేమ్ ఛేంజర్(game changer) రూపంలో మరో డిజాస్టర్ ను మూట గట్టుకున్నారు. ఈ రెండు సినిమాల పరాజయం ఆయనెప్పటి నుంచో చేయాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్టు పై పడింది.
శంకర్ ఎన్నో ఏళ్లుగా వేల్పరి(Velpari) అనే సినిమాను తీయాలని, ఆ సినిమానే తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఎన్నో సార్లు వెల్లడించారు. పురాతన శతాబ్ధాలకు చెందిన వేల్పరి రాజులకు చెందిన కథ. ఈ కథపై ఓ నవల కూడా వచ్చింది. ఈ కథను తెరపైకి తీసుకుని రావాలంటే ఎంతో భారీగా ఖర్చవుతుంది. శంకర్ కు ఆ ఖర్చు ఇంకాస్త ఎక్కువ అవుతుందని మళ్లీ ప్రత్యేకించి చెప్పే పన్లేదు.
మొత్తం వేల్పరి కథను మూడు భాగాలుగా తెరకెక్కించాలని శంకర్ ఎన్నో ఏళ్లుగా ఈ కథపై వర్క్ చేస్తున్నారు. ఈ కథను రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో చేయాలని శంకర్ చూస్తున్నప్పటికీ అతన్ని నమ్మి అంత మొత్తం బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలెవరూ రెడీగా లేరు. ఒకప్పుడు సౌత్ సినిమా స్థాయిని తన సినిమాలతో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లిన శంకర్ సినిమా చేస్తానంటే దానికి డబ్బులు పెట్టే నిర్మాతలు లేకపోవడం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ అతని ఫామ్ ను చూసి నిర్మాతలు వెనుకడుగు వేయడంలో కూడా న్యాయముంది.