కల్కి వాయిదా కోసం ఎదురుచూపులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సినిమా కల్కి 2898ఏడి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గానే ఇటలీలో ప్రభాస్, దిశా పటానీపై ఓ సాంగ్ ను కూడా షూట్ చేశారు. ఇప్పుడు తర్వాత జరగనున్న కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉండనుంది. మే 9న కల్కిని రిలీజ్ చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.
రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని పదే పదే నిర్మాణ సంస్థ చెప్తున్నప్పటికీ ఇతర నిర్మాతలు మాత్రం కల్కి వాయిదా పడుతుందేమోనన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. గతేడాది సలార్ లానే ఇప్పుడు ఈ సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందేమోనని కొందరి ఆశ. అలా కల్కి పోస్ట్ పోన్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాల్లో పాన్ ఇండియా సినిమాల నుంచి మీడియం రేంజ్ సినిమాల వరకు ఉన్నాయి.
కల్కి రిలీజ్ డేట్ ను బట్టి ఇండియన్2 రిలీజ్ ఉండే ఛాన్సుంది. సుధీర బాబు హరోం హర, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు కుదిరితే ఛాన్స్ ను వాడుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ గంగం గణేషా లాంటి సినిమాలు కూడా కల్కి వాయిదాను కోరుకుంటున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమైతే కల్కి మే 9న రావడం పక్కానే. విఎఫ్ఎక్స్ విషయంలో అవుట్ పుట్ బాగుంటే మాత్రం కల్కి చెప్పిన టైమ్ కు రావడం గ్యారెంటీ అని యూనిట్ వర్గాలంటున్నాయి.













