SKN: మంచి మనసు చాటుకున్న ప్రొడ్యూసర్ SKN
జర్నలిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి నిర్మాతగా మారి పలు సక్సెస్ఫుల్ సినిమాలను తీశారు ఎస్కేఎన్(SKN). నిర్మాతగా పలు సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించిన ఎస్కేఎన్ ఎన్నో సందర్భాల్లో పలువురికి సాయం చేస్తూ వస్తున్నాడు. కుడి చేత్తో చేసిన సాయాన్ని ఎడమ చేతికి కూడా తెలియకూడదనే మాటను నిజం చేస్తూ ఎస్కేఎన్ ఆపదలో ఉన్న వాళ్లని ఆదుకుంటున్నారు.
కష్టాల్లో ఉన్నామని ఎవరైనా సోషల్ మీడియాలో ఎస్కేఎన్ ను సంప్రదిస్తే చాలు అన్ని విషయాలు కనుక్కుని మరీ హెల్ప్ చేస్తుంటారు. అలా ఎంతో మందికి సాయం చేసిన ఎస్కేఎన్ తాజాగా మరోసారి గొప్ప మనసుని చాటుకున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు(mahesh babu) ఫ్యాన్ ఒకరు చనిపోగా, అతని కుటుంబాన్ని ఆదుకున్నారు. సోషల్ మీడియాలోని పోస్ట్ చూసి రియాక్ట్ అయిన ఎస్కేఎన్ వారి ఫ్యామిలీకి సాయం చేశారు.
చనిపోయిన మహేష్ అభిమాని పిల్లల చదువు నిమిత్తం రూ.2 లక్షలు ఇస్తానని ప్రామిస్ చేసిన ఎస్కేఎన్ ఆ మాటను నిలబెట్టుకుంటూ వారి కుటుంబాన్ని కలిసి చెక్ ఇచ్చారు. ఎస్కేఎన్ చేసిన ఈ పనిని సోషల్ మీడియాలోని వారందరూ ప్రశంసిస్తుండగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునే మంచి మనసు ఎస్కేఎన్ ది అంటూ అందరూ అతని మంచితనం గురించి పోస్టులు పెడుతున్నారు.






