ఎమ్మెల్యే గారి తాలూకా.. టైటిల్ను రిజిస్టర్ చేయించే పనిలో నిర్మాత
ఎలక్షన్ రిజల్ట్స్ మరో 5 రోజుల్లో రానున్నాయి. దీంతో దేశమంతటా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. రేపటి నుంచి ఎగ్జిట్ పోల్స్ హడావిడి స్టార్ట్ కానుంది. ఎవరు గెలుస్తారనే విషయంపై ఎన్నో అంచనాలు, బెట్టింగులు జరిగిపోతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం మీదే ఉంది. పవన్ పోటీ చేస్తున్న ఈ స్థానం నుంచి పవన్ గెలుస్తాడనే ధీమా అందరూ వ్యక్తం చేస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే పవన్ ఫ్యాన్స్ తమ బైకులకు, కార్లకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని వేయిస్తున్న స్టిక్కర్లు ఇప్పుడు ఏపీ మొత్తం ట్రెండ్ అవుతున్నాయి. వీటి కోసం వాటికి సంబంధించిన షాపుల దగ్గర పవన్ ఫ్యాన్స్ బారులు తీరి మరీ చేయించుకుంటున్నారు. ఇలా చేయడం మోటార్ యాక్ట్ ప్రకారం తప్పని తెలిసినా వందలు వేలు ఖర్చు పెడుతున్నారు.
వాటికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన ఓ మీడియం రేంజ్ నిర్మాత ఎమ్మెల్యే గారి తాలూకా అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించడానికి రెడీ అవుతున్నాడట. స్టోరీ, డైరెక్టర్ తన దగ్గర లేకపోయినా రేపు పవన్ గెలిచాక ఇదే టైటిల్ కు డిమాండ్ పెరగడం గ్యారెంటీ అని ఆలోచించి సదరు నిర్మాత టైటిల్ ను రిజిస్టర్ చేయించే పనిలో పడ్డాడని తెలుస్తోంది.













