ఓ సినిమా కోసం వస్తే, మరో సినిమా గురించి అడుగుతున్నారు
ప్రొడ్యూసర్ నాగ వంశీ సోదరి సమర్పించిన మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ వ్యవహారాలన్నీ దగ్గరుండి నాగవంశీనే చూసుకున్న విషయం తెలిసిందే. దీని కోసం ఆయన స్పెషల్ గా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్కు మంచి గెస్టులను తీసుకొచ్చి సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేయగలిగాడు. సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్స్ ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్నాడు నాగ వంశీ.
అయితే నాగవంశీ మ్యాడ్ సినిమాను ప్రమోట్ చేయడానికి వస్తే, మీడియా మాత్రం ఆయన్ను గుంటూరు కారం విశేషాలు అడగటంలో మునిగిపోయింది. మీడియాతో ఏర్పాటు చేసిన ఫేస్ టు ఫేస్ లో ప్రతి ఒక్కరూ ఆయన్ను గుంటూరు కారం విశేషాలడిగేవారే. దానికి నాగవంశీ కూడా ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ ఇచ్చే కామెంట్స్ చేశారు.
గుంటూరు కారం సినిమా టాకీ పార్ట్ అక్టోబర్ 20లోపు పూర్తి కానుందని, వచ్చే నెలాఖరుకు పాటలు ఫినిష్ చేస్తామని, ఇప్పటి వరకు ఇలాంటి సినిమా మహేష్ కెరీర్ లో రాలేదని, ఇంటర్వెల్ సీక్వెన్స్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని గుంటూరు కారం గురించి ఫ్యాన్స్ కు ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ మాటలు విని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆనందపడిపోతున్నారు. మొత్తానికి మ్యాడ్ కోసం వచ్చిన నాగవంశీ నుంచి గుంటూరు కారం అప్డేట్స్ రప్పించడంలో మీడియా సక్సెస్ అయిందనే చెప్పాలి.













