నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు
నిర్మాతల మండలికి ఎన్నికలు అవసరం లేదని చాలా మంది నిర్మాతల అభిప్రాయం అని ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. తెలుగు ఫిలిం చాంబర్ నిర్మాతల మండలి ఎన్నికలు ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రతాని మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమా నిర్మాతల మండలికి ఈ నెల 30 ఎన్నికలు జరగనున్నాయని, మండలి సమావేశం జరిపి రెండు ప్యానల్స్ ని ఎంపిక చేసిందన్నారు. ఆ తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రెండు ప్యానల్స్ ఒకటయ్యాయన్నారు. అందులో కొందరిని పక్కన పెట్టారన్నారు. కొందరు కావాలని ఇష్యూన్ క్రియేట్ చేస్తున్నారన్నారు. ఈ నెల 18న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విత్డ్రా చేసుకుంటే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో మరో నిర్మాత శంకర్ గౌడ్, మరో నిర్మాత జెవిఆర్ తదితరులు మాట్లాడారు.













