Priyanka Chopra: దేవకన్యలా మెరిసిపోతున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా(priyanka chopra) ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న వారణాసి(varanasi) మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్ లో ప్రియాంక దేవకన్య లాగా ముస్తాబై కనిపించింది. ప్రియాంక ఈ గ్రాండ్ ఈవెంట్ కు సాంప్రదాయ లుక్ లో రావడం చూసి అందరూ షాకయ్యారు. అనామిక ఖన్నా(anamika khanna) డిజైన్ చేసిన అవుట్‌ఫిట్ లో ప్రియాంక కనిపించింది. క్రీమ్ కలర్ బ్లౌజ్, స్కర్ట్ తో పాటూ అదే కలర్ ఓణీ ధరించి, చేతికి కడియాలతో పాటూ మెడలో భారీ చౌకర్, పాపిట బిళ్ల, జడకు బిళ్లలు, నడుముకు వడ్డాణం పెట్టుకుని చాలా అందంగా మెరవగా, ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






