Priyamani: మణిరత్నం సినిమా కోసం చేతులు కోసుకుంటానన్న ప్రియమణి
ప్రియమణి(Priyamani) అందం, నటన గురించి కొత్తగా చెప్పే పన్లేదు. తను ఎలాంటి పాత్ర చేసినా ఆ పాత్రకి 100% న్యాయం చేయగలదు ప్రియమణి. పెళ్లైన కొత్తలో(Pellaina Kothalo) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ప్రియమణి పెళ్లి తర్వాత యాక్టింగ్ కెరీర్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి సినిమాలు, సిరీస్‌లు, టీవీ షోలతో బిజీగా ఉంది.
ఇక అసలు విషయానికొస్తే ప్రియమణి తాజాగా మణిరత్నం గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు మణిరత్నం(Mani Ratnam) అంటే ఎంతో ఇష్టమని, ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వస్తే అన్నీ వదిలేసి దానికోసమే ఎదురుచూస్తుంటానని, అంతేకాదు దాని కోసం చేయి కోసుకోడానికైనా రెడీ అని ప్రియమణి అంటోంది.
మణిరత్నం చేసిన సినిమాలు, ఆయన ఎక్స్‌పీరియెన్స్ చూస్తే ఎవరికైనా ఆయన దర్శకత్వంలో పని చేయాలనిపిస్తుందని చెప్పిన ప్రియమణి గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రావన్(raavan) సినిమాలో నటించింది. ప్రస్తుతం ప్రియ బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్3(Family Man2) సిరీస్ లో నటిస్తోంది. అందులో హీరో మనోజ్ భాజ్‌పాయ్(Manoj Bhajpai) భార్యగా ప్రియమణి కనిపించనుంది.













