Priyamani: జననాయగన్ నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్

దళపతి విజయ్(Vijay) హీరోగా పూజా హెగ్డే(pooja hegde) హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా జన నాయగన్(jana nayagan). హెచ్ వినోద్(H. Vinoth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రేమలు(premalu) ఫేమ్ మమిత బైజు(mamitha byju) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లతో పాటూ జన నాయగన్ లో ప్రముఖ నటి ప్రియమణి(priyamani) కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తాజాగా ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జన నాయగన్ సినిమా చేయడంపై తన ఆనందాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో విజయ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పిన ప్రియమణి, జననాయగన్ తన కెరీర్లో చాలా స్పెషల్ ఫిల్మ్ అని, ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు.
ఇప్పటికే భారీ అంచనాలున్న జన నాయగన్ సినిమాపై ప్రియమణి వ్యాఖ్యలు మరిన్ని అంచనాల్ని పెంచాయి. కాగా ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఫస్ట్ రోర్ పేరుతో ఓ వీడియో రిలీజవగా ఆ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. జన నాయగన్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుండగా, ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) సంగీతం అందిస్తున్నారు.