Premistunnaa: ప్రేమిస్తున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా (Premistunnaa). సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు.
ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులలతో పాటు యువ హీరోలు పూరి ఆకాష్, రోషన్ కనకాల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ…
మీడియాకు మరియు ప్రేక్షకులకు నమస్కారం. ఒక సినిమా విడుదల తేది వరుకు వచ్చింది అంటే దాని వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసు. ప్రేమిస్తున్నా అందరి ఆశీస్సులతో నవంబర్ 7న విడుదల కానుంది, సాత్విక్ నటన చాలా బాగుంటుంది, డెబ్యూ హీరోలా కాకుండా బాగా చేసాడు. మూవీ యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలిపారు.
పూరి ఆకాష్ మాట్లాడుతూ…
హీరో సాత్విక్ తనకు తమ్ముడిలాంటివాడని, చిన్నప్పటి నుండి సాత్విక్ చైల్డ్ యాక్టర్‌గా ఎదిగి, ఇప్పుడు హీరోగా తన మొదటి సినిమా చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. సాత్విక్ ఎన్నో ఆడిషన్లు ఇచ్చి, తన సొంత కష్టం మీద ఎదిగాడని, అతను ఒక నిజమైన నటుడని ప్రశంసించారు. ‘ప్రేమిస్తున్నా’ టీజర్, పాటలు చూసినప్పుడు సాత్విక్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అని, అతని నటన కోసమే సినిమా చూడాలనిపిస్తుందని అన్నారు. దర్శకుడు భను గారికి, నిర్మాత కనకదుర్గారావు గారికి ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రేమిస్తున్నా చిత్రం నుండి ఇటీవల సోల్ ఆఫ్ ప్రేమిస్తున్నా, మరియు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. 56 సెకెన్స్ నిడివి ఉన్న కంటెంట్ యువతను విపరీతంగా ఆకట్టుకొంటోంది. సినిమా ఎలా ఉండబోతోందో ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతుంది, స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించబోతున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు భాను మాట్లాడుతూ…
“అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ సినిమా రాలేదు, అద్భుతమైన పాటలు, పర్ఫార్మెన్స్ తో ఈ చిత్రం నవంబర్ 7న థియేటర్స్ లో విడుదల కానుంది. చాలా కాలం తరువాత వస్తోన్న బ్యూటిఫుల్ లవ్ స్టొరీ ఈ సినిమా, మేము విడుదల చేసిన ట్రైలర్ కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోందని” అన్నారు.
ఇదొక మ్యూజికల్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాస్కర్ శ్యామల ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు సంభాషణలు రాయడం జరిగింది, ఈ సినిమాకు నిర్వహణ మర్రి రవికుమార్, ఎడిటర్ శిరీష్ ప్రసాద్.







