నందమూరి బాలకృష్ణ బోయపాటి ప్రాజెక్ట్ లో మలయాళ కుట్టి ప్రగ్యా మార్టిన్!
ప్రస్తుతం సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఏర్పడింది. వారి సినిమాలకు కథలున్నాయి, డైరెక్టర్లు ఉన్నారు, డబ్బులు పెట్టే నిర్మాతలూ ఉన్నారు. కథకు తగ్గ టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ అసలైన గ్లామర్ మాత్రం దక్కడంలేదు. కొంతమంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని, మరికొంతమంది హీరోయిన్స్ యంగ్ హీరోల పక్కనే చేస్తామని సీనియర్ హీరోలకు నో అంటున్నారు. ఒకవేళ డబ్బు గురించి ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడంతో నటిస్తే కనుక తరవాత సినిమాలలో యంగ్ హీరోలు ఛాన్స్ ఇవ్వరని తన కెరీర్ అక్కడితో ఆగిపోతుందని భయపడుతున్నారు. దాంతో టాప్ సీనియర్లు అంతా హీరోయిన్ల సెర్చింగ్ లోనే ఉన్నారు.
ఇక నందమూరి బాలకృష్ణ బోయపాటి #బిబి3 మూవీకి హీరోయిన్ సమస్య అలాగే ఉంది. ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ చేశారు. కరోనా వచ్చి ఏడు నెలలు అయింది. రెండవ షెడ్యూల్ ని సెట్స్ మీదకు తేవాలని బోయపాటి చూస్తున్నాడుట. అయితే హీరోయిన్ సమస్యే తలనొప్పిగా మారిందని అంటున్నారు. ముంబై మోడల్స్ ని అనుకున్నారు. అదే విధంగా చాలా మంది హీరోయిన్ల పేరు కూడా వినిపించింది కానీ ఏ ఒక్కరూ ఫైనల్ కాలేదు. తాజాగా ఒక కొత్త పేరు మాత్రం వినిపిస్తోంది. అదే ప్రగ్యా మార్టిన్. ఈ అమ్మడు మలయాళ కుట్టి. ఆమె పిశాచి అని తెలుగు డబ్బింగ్ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంలో ఆమె సినిమాలు ఏం చేస్తుందో తెలియదు కానీ పిశాచి చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయిన ఫేస్ గా ఉంది. ఇక ఆమెను బాలయ్య పక్కన నటింపచేయాలని బోయపాటి చూస్తున్నాడు అంటున్నారు. మరి ఆమె ఓకే అంటే మాత్రం బాలయ్యకు హీరోయిన్ల కొరత తీరినట్లే మరి చూడాలి దసరా రోజున సినిమాకు సంబంధించి అన్ని విషయాలూ చెబుతాను అని బోయపాటి అంటున్నారు. దానికోసం బాలయ్య ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని బోయపాటి బాలయ్య డిసైడ్ అయ్యారు. దాంతో కసిగా పనిచేస్తున్నారు అంటున్నారు.













