ఒకప్పటి బెంగళూరు డాన్‌గా..
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన `కెజిఎఫ్` దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కెజిఎఫ్ చాప్టర్ 2ని రూపొందించే పనిలో ఉన్నాడు ప్రశాంత్. అయితే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్… ఎన్టీఆర్‌కు కథ వినిపించారని, కథ నచ్చడంతో ఎన్టీఆర్ ఓకే చెప్పారని తెలుస్తోంది.
కెజిఎఫ్ తరహాలోనే ఈ కథ కూడా ఉంటుందని సమాచారం. బెంగళూరులో ఒకప్పుడు డాన్‌గా ఉన్న ఓ వ్యక్తి కథతో ఎన్టీఆర్ సినిమా ఉంటుందట. టోటల్‌గా ఆ డాన్ కథతోనే చేస్తున్నప్పటికీ సినిమాటిక్‌గా ఉండేందుకు కొన్ని ఫిక్షన్ సీన్స్‌ని కూడా ఇందులో జోడిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కెజిఎఫ్‌ని మించే స్థాయిలో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయట. ఆ డాన్‌కి సంబంధించి ప్రశాంత్ కొంత రీసెర్చ్ చేశాడట. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ని రెడీ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్‌ని నిలిపివేశారు.
ఈ సినిమా పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ కాన్సన్ట్రేట్ చేస్తారని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ సినిమా కథకి సంబంధించిన వివరాలేవీ ఇప్పటివరకు ప్రకటించలేదు.













