Prabhas: ప్రభాస్ లుక్ టెస్ట్ లో ప్రశాంత్ వర్మ
ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్(The Raja Saab), ఫౌజీ(Fouji) షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్ ఉగాదికి సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) స్పిరిట్(Spirit) సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ప్రభాస్ లైన్ లో పెట్టాడు. ప్రశాంత్ నీల్(Pasanth Neel) దర్శకత్వంలో సలార్2(Salaar2)తో పాటూ నాగ్ అశ్విన్(nag ashwin) దర్శకత్వంలో కల్కి2(Kalki2)ను కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.
ఇవి కాకుండా మరికొన్ని సినిమాలకు కూడా డార్లింగ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. వాటిలో టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కు కూడా ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. హోంబళే ఫిల్మ్స్(Hombale Films), ప్రభాస్ తో లాక్ చేసుకున్న మూడు మూవీల్లో ప్రశాంత్ వర్మ(Prasanth Varma) సినిమా కూడా ఒకటని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ- ప్రభాస్ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ వర్మ సినిమా లుక్ టెస్ట్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వారంలోనే లుక్ టెస్ట్ ఫినిష్ అవుతుందని, ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ లుక్ ను కూడా డిజైన్ చేశాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబోలో రానున్న సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఈ విషయంలో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













