రాజమౌళి కోసం ఆ ఆలోచనను వదిలేశా- ప్రశాంత్ వర్మ
హనుమాన్ అనే సినిమాతో తెలుగులో సూపర్ హీరో మూవీ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ముందు నుంచి ఎంతో ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. ఈ మూవీతో ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సిరీస్‌లకు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ను స్టార్ట్ చేశాడు. ఈ యూనివర్స్‌లో 10 సూపర్ హీరో కథలను చెప్పాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నాడట.
మొదటి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ కు మహా భారతం సిరీస్‌ను చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలోనే చెప్పాడు. తను మహాభారతం చేస్తే ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటాడో కూడా రీసెంట్ గా ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం ప్రశాంత్ వర్మ మహభారతం సిరీస్ చేయాలని ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపాడు.
రాజమౌళి ఎప్పుడైతే మహాభారతం చేస్తానని ప్రకటించారో అప్పుడో తాను ఆ ఆలోచనను వదులుకున్నట్లు ప్రశాంత్ క్లారిటీ ఇచ్చాడు. మహాభారతం లాంటి కథ రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడితే అదెంతో గొప్పగా ఉంటుందని ప్రశాంత్ వర్మ అన్నాడు. ఇక హనుమాన్ విషయానికి వస్తే ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే ప్రశాంత్ తన యూనివర్స్‌లో సినిమాలు చేసుకుంటూ పోవచ్చు. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ డీవీవీ దానయ్య కొడుకుతో అధీరా అనే మరో సూపర్ హీరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.













