Prasanth Varma: ప్రశాంత్ వర్మ నెక్ట్స్ ప్లానేంటి?
గతేడాది హనుమాన్(Hanuman) సినిమాతో సూపర్ హిట్ అందుకుని పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma). ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్(Jai Hanuman) అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటివరకు దానికి సంబంధించిన షూటింగ్ మొదలవలేదు. డిసెంబర్ లో మోక్షజ్ఞ(Mokshagna) డెబ్యూ సినిమా స్టార్ట్ అవాల్సింది కానీ అది వాయిదా పడింది. మళ్లీ అదెప్పుడుంటుందో క్లారిటీ లేదు.
ఈ లోపు తన రచనా నిర్మాణంలోనే మహాకాళి(Maha Kaali) అనే సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను వేరే దర్శకురాలితో అనౌన్స్ చేశాడు వర్మ. మరోవైపు అధీరా(Adheera) పనులు చూసుకుంటున్నాడు. కానీ తన దర్శకత్వంలో మాత్రం సినిమాను ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. మోక్షు సినిమా లేటవుతుందనుకుంటే ప్రశాంత్ వర్మ వేరే సినిమానైనా స్టార్ట్ చేయడం బెటర్.
హనుమాన్ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తున్న ప్రశాంత్ వర్మకు ఏం చేస్తున్నా కలిసిరావడం లేదు. ఇదంతా చూస్తుంటే రిషబ్ శెట్టి(Rishab Shetty) కాంతార2(Kanthara2) పూర్తి చేసుకుని వచ్చే వరకు జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేయడం తప్ప మరో దారి కనిపించడం లేదు. ఇదంతా ఎందుకు నెక్ట్స్ ప్లాన్ ఏంటని ప్రశాంత్ వర్మనే అడుగుదామంటే ఆయనెక్కడా కనిపించడం లేదు.













