Jai Hanuman: భారీ మల్టీస్టారర్ గా జై హనుమాన్
ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తెరకెక్కిస్తున్న జై హనుమాన్(Jai Hanuman) మూవీపై భారీ హైప్ ఉంది. హను మాన్(Hanuman) కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. హను మాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో దాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లాలని చాలా పెద్ద ప్లానే వేశాడు. అందులో భాగంగానే జై హనుమాన్ ను గొప్ప మైథాలాజికల్ మల్టీస్టారర్ గా తీసే ప్రయత్నం చేస్తున్నాడు.
జై హనుమాన్ మూవీ కేవలం హనుమంతుని కథతో మాత్రమే కాకుండా అందులో ఏడుగురు చిరంజీవులైన అశ్వత్థామ, విభీషణుడు, బలి చక్రవర్తి, కృపాచార్య, పరశురాముడు, వ్యాసుడు కూడా కనిపించనున్నారని, ఆ పాత్రల కోసం అన్ని ఇండస్ట్రీల్లోని అగ్ర హీరోలతో ప్రశాంత్ వర్మ చర్చలు జరుపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
అదే నిజమైతే టాలీవుడ్ లో ఇంతకుముందెప్పుడూ చూడని గొప్ప మైథలాజికల్ మల్టీస్టారర్ గా ఇది చరిత్ర సృష్టించడం ఖాయం. ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకుని ప్రతీ పాత్రను గొప్పగా చూపించాలని స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్త పడుతున్నాడట ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ ను పాన్ ఇండియా లెవెల్ లో ఎమోషన్స్, భక్తితో పాటూ గ్రాండ్ విజువల్స్ తో ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వాలని ప్రశాంత్ వర్మ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమా నిర్మాణంలో భాగమవడానికి ఇండియాలోని పలు అగ్ర నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం.













