స్టార్ హీరో కోసం ప్రశాంత్ వెతుకులాట
ఇప్పటికే రూ.200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన హను మాన్ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో చేరడానికి ట్రై చేస్తుంది. హను మాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. హను మాన్ సక్సెస్ అవడంతో జై హను మాన్ పై అంచనాలు భారీ గా ఉన్నాయి.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమంతుడి క్యారెక్టర్ కోసం పెద్ద స్టార్ హీరోని ట్రై చేస్తున్నట్లు ఇప్పటికే చెప్పాడు. ఈ విషయాన్ని రీసెంట్ గా ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. జై హనుమాన్ లో తేజ సజ్జ ఉన్నప్పటికీ హనుమాన్ పాత్రలో మరో స్టార్ హీరో నటిస్తాడని చెప్పాడు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం జై హనుమాన్ లో చేయాలని ప్రశాంత్ వర్మ నానిని సంప్రదించినట్లు టాక్.
కానీ నాని దానికి ఏం సమాధానమిచ్చాడనేది తెలియాల్సి ఉంది. మరోవైపు నాని ఆహార్యం హనుమాన్ పాత్రకు సరిపోతుందా అనే డౌట్ ను కూడా నాని వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో వేరే సినిమాను ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ఈ సినిమా కోసం అడిగే అవకాశం లేదు. మరి జై హనుమాన్ లో ఏ స్టార్ నటిస్తాడో చూడాలి.













