Prasanth Varma: మళ్లీ ఆ పనుల్లో బిజీ అయిన ప్రశాంత్ వర్మ
అంచనాల్లేకుండా వచ్చిన హను మాన్(HanuMan) పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అవడంతో ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ సినిమా సంచలనాలు సృష్టించడంతో ప్రశాంత్ వర్మ కు అవకాశాలు కూడా క్యూ కట్టాయి. స్వయంగా బాలకృష్ణ(Balakrishna) తన కొడుకు డెబ్యూ సినిమా బాధ్యతను అప్పగించేశాడు.
మోక్షజ్ఞ(Mokshagna) ఎంట్రీ సినిమా కోసం హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్(Jai Hanuman) ను పక్కనపెట్టాడు ప్రశాంత్ వర్మ. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట ఆగిపోయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ చేతుల్లో నుంచి ఆ సినిమా మరొక డైరెక్టర్ చేతిలోకి వెళ్లినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత నాగ్ అశ్విన్(Nag Ashwin) తీసుకున్నాడని తాజా సమాచారం.
దీంతో ప్రశాంత్ వర్మ ఇప్పుడు మళ్లీ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ అయినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ సినిమా కోసం కొంత టైమ్ వేస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ మధ్యలో వదిలేసిన జై హనుమాన్ పనులను పునః ప్రారంభిస్తున్నాడట. అయితే ప్రశాంత్ వర్మ అడక్కుండానే అవకాశమిచ్చిన బాలయ్య దాన్ని మధ్యలోనే లాగేసుకోవడం మాత్రం ఎవరికీ నచ్చడం లేదు.













