Prasanth Neel: సంచలన నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నీల్
ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో వచ్చిన సలార్(Salaar) సినిమా మంచి హిట్ అయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సలార్1 ఏకంగా రూ.700 కోట్లు కలెక్ట్ చేసినప్పటికీ ఆ సినిమా సక్సెస్ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసంతృప్తిగా ఉన్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. తానొకటి అనుకుంటే సినిమా రిజల్ట్ మరోలా ఉందని నీల్ నిరుత్సాహం వ్యక్తం చేశాడు.
సలార్ కు తాను ఆశించన ఫలితం రాలేదని, ఆ సినిమాలో కేజీఎఫ్(KGF) ఛాయలున్నాయనే కామెంట్స్ తనను ఇబ్బంది పెట్టినట్టు తెలిపాడు. సలార్ టైమ్ లోనే కెజిఎఫ్ పై కూడా ఫోకస్ చేయడంతోనే ఈ పొరపాటు జరిగిందని నీల్ అన్నాడు. అందుకే నీల్ ప్రస్తుతం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటినుంచి ఒకేసారి రెండు సినిమాలకు పని చేయకూడదని నీల్ డిసైడయ్యాడట.
ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలపై ఫోకస్ పెట్టలేనని గ్రహించిన నీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నీల్(Neel) ఎన్టీఆర్(NTR) తో డ్రాగన్(Dragon) అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నీల్ ఫోకస్ మొత్తం ఆ ప్రాజెక్టుపైనే ఉంది. ఎన్టీఆర్ కోసం నీల్ తన స్క్రిప్ట్ ను మరింత పదును పెడుతున్నాడని సమాచారం.













