ప్రశాంత్ నీల్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్. రాజమౌళి తర్వాత ప్రస్తుతం ఎక్కువ క్రేజ్ ఉన్న డైరెక్టర్ ప్రశాంత్. బాక్సాఫీస్ లెక్కల్లో కూడా రాజమౌళి తర్వాతి ప్లేస్ ప్రశాంత్ నీల్దే. కెజిఎఫ్, సలార్ సినిమాలతో భారీ సక్సెస్ ను అందుకున్న ప్రశాంత్ తర్వాతి సినిమాలపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
కెజిఎఫ్ కు ముందు కన్నడ సినీ పరిశ్రమ స్థాయి వేరు, కెజిఎఫ్ తర్వాత కన్నడ సినీ పరిశ్రమ స్థాయి వేరు. ఇంకా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ వల్లే కన్నడ సినీ పరిశ్రమ ఇవాళ ఈ స్థాయిలో ఉంది. అలాంటి ప్రశాంత్ నీల్ కు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అందరికంటే అతణ్ణి ఎక్కువగా ఇన్స్పైర్ చేసిందెవరు అన్న ప్రశ్నలకు రీసెంట్ గా ప్రశాంత్ నీల్ సమాధానమిచ్చాడు.
ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ నీల్, తనకు నచ్చిన దర్శకుడు ఉపేంద్ర అని చెప్పాడు. తను కన్నడ కార్యక్రమంలో ఉన్నందుకు ఉపేంద్ర పేరు చెప్పట్లేదని, ఆయనలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదన్నాడు. కథ చెప్పే విధానంలో, వాటిని ప్రెజెంట్ చేసే తీరులో ఉపేంద్రది చాలా డిఫరెంట్ స్టైల్. ఓం, ఏ, ష్, ఉపేంద్ర లాంటి సినిమాలు చూశాక, ఇలా కూడా సినిమా తీసి హిట్ కొట్టొచ్చా అనిపించిందని అందుకే ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని ప్రశాంత్ నీల్ పేర్కొన్నాడు.













