Prabhas vs Shahrukh: ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ మధ్య పెరుగుతున్న వివాదం
షారుఖ్ ఖాన్(Shah rukh khan) హీరోగా చేస్తున్న నెక్ట్స్ మూవీ కింగ్(king). సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యాన్స్ దాన్ని ఎంజాయ్ చేసే లోపే ఆన్ లైన్ లో ఓ కొత్త ఫ్యాన్ వార్ మొదలైంది. అనుకోకుండా షారుఖ్, ప్రభాస్(prabhas) ఫ్యాన్స్ మధ్య వివాదం స్టార్ట్ అయింది. రీసెంట్ గా షారుఖ్ కు బర్త్ డే విషెస్ ను తెలియచేస్తూ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) అతన్ని ఇండియాస్ కింగ్ అని ప్రస్తావించారు.
స్టార్లు కేవలం సూపర్ స్టార్ అని కాకుండా వేరే పేరు తెచ్చుకున్నప్పుడే వారిని కింగ్ అని పిలుస్తారని పోస్ట్ చేయగా, వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ సిద్ధార్థ్ ఆనంద్ చేసిన పోస్ట్ కు డాట్స్ కనెక్ట్ చేస్తూ ఆల్రెడీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) స్పిరిట్ టీజర్(spirit teaser) లో వ్యాఖ్యానించడంతో సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ ను ఉద్దేశించే అన్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు.
దీంతో ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ మధ్య గొడవ మొదలైంది. ఆ హీరోల ఫ్యాన్స్ ఇద్దరూ తమ తమ అభిమాన హీరోలను సమర్థించుకోవడంలో భాగంగా మీమ్స్, ట్రోల్ వీడియోలను పోస్ట్ చేయడంతో ఈ వివాదం సోషల్ మీడియాను గందరగోళంగా మార్చింది. అటు షారుఖ్, ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ గొడవకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో తెలియడం లేదు.







