రెండు సినిమాలలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే?
ఇప్పటికే వైజయంతి మూవీస్ చిత్రం లో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే ఆఫీసియల్ కంఫర్మ్ అయ్యింది. ఇప్పుడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ 500 కోట్లతో భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రెండు రోజుల క్రితం ప్రభాస్ ఒక ప్రకటన చేశాడు. ఇక ఈ సినిమా విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. విలన్ ఎవరు అనేది తెలిసింది సైఫ్ అలీ ఖాన్ విల్లన్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. అదే విధంగా ఈ సినిమా లో హీరోయిన్ ఎవరు అనే దానిపై చాలా వరకు చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా హీరోయిన్ గా దీపికా పదుకొనే తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
వాస్తవానికి దీపికా మినహా మరో హీరోయిన్ ప్రభాస్ పక్కన ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోయే అవకాశం లేదని టాలీవుడ్ జనాలు బాలీవుడ్ జనాలు కూడా అన్నారు. అయితే మరో వార్త కూడా వచ్చింది. మళ్లీ బాలీవుడ్ లో ఈ సినిమాకు అనుష్కనే తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. అయితే అనుష్క ప్రభాస్ ఇప్పటికే దాదాపు నాలుగైదు సినిమాల్లో నటించడం తో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అంతగా ఆదరణ వుండదు అని భావించి వీరిద్దరినీ పక్కా వద్దు అని వద్దని ఇప్పుడు దీపికా పదుకొనే ని ఒకే చేసినట్టు తెలుస్తుంది. ఇక మరో హీరోయిన్ అనుష్క శర్మని కూడా ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి అనుష్క శర్మ ఇప్పటి వరకు ఈ తరహా సినిమాల్లో నటించలేదు. అయితే దీపికా పదుకొనే బాజీరావు మస్తాని, పద్మావతి వంటి సినిమాల్లో నటించింది. దీనితో ఆమె అయితే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఈ సినిమా టైటిల్ ని ఆదిపురుష్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే 2022 ప్రారంభం నాటికి ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.













