Prabhas: ఎట్రాక్ట్ చేస్తున్న డార్లింగ్ నయా లుక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ఆరడుగులకు పైగా ఎత్తు, మంచి అందంతో చాలా అందంగా ఉంటాడనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కానీ బాహుబలి(baahubali) సినిమా తర్వాత ప్రభాస్ అందం మొత్తం పాడైపోయింది. ప్రభాస్ లుక్స్ ఒకప్పటిలా ఆకర్షణీయంగా లేవు. అందుకే అందరూ ప్రభాస్ ను ఏ డైరెక్టర్ బాగా చూపిస్తాడా అని డైరెక్టర్లను నమ్ముకోవడం మొదలుపెట్టారు.
అయితే ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్(raja saab), ఫౌజీ(Fauji) సినిమాలు చేస్తుండగా, ఈ రెండింటిలో రాజా సాబ్ లో మారుతి(maruthi), ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపిస్తున్నాడు. మొదట్లో రాజా సాబ్ సినిమా చేయొద్దని చెప్పిన డార్లింగ్ ఫ్యాన్స్ తోనే లుక్స్ విషయంలో మారుతి ప్రశంసలు అందుకున్నాడు. ఇదిలా ఉంటే సినిమాల్లో కాకుండా బయట కూడా ప్రభాస్ తన లుక్స్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోవడం లేదని చాలానే కామెంట్స్ వచ్చాయి.
ఈ మధ్య ప్రభాస్ బయట ఎక్కడ కనిపించినా తలకు ఓ క్లాత్ ధరించి, దాంతో తన తల మొత్తాన్ని కవర్ చేసుకుంటూ కనిపించేవారు. కానీ తాజాగా కల్కి నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ ఇచ్చిన ఓ పార్టీలో ప్రభాస్ లుక్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఎప్పుడూ తలను ఓ క్లాత్ తో కవర్ చేసే ప్రభాస్ ఈసారి చాలా మంచి హెయిర్ స్టైల్ తో కనిపించడంతో డార్లింగ్ లుక్స్ సంథింగ్ స్పెషల్ గా మారాయి. ఈ పార్టీలో ప్రభాస్ తో పాటూ యాక్టర్ సుబ్బరాజు(Subbaraju), ఏపీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(RRR), కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ(Shravya Varma) పాల్గొనగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.






