ఆ జాబితాలో ప్రభాస్‌కు పదో స్థానం
బాహుబలి చిత్రాల ద్వారా ప్రభాస్‌కు అంతర్జాతీయస్థాయిలో కూడా అభిమానులు ఏర్పడ్డారు. తాజాగా, ప్రభాస్‌కు అభిమానులు ఆసియా అత్యంత శృంగార పురుషుల జాబితాలో 10వ స్థానం కట్టబెట్టారు. బ్రిటీష్ న్యూస్ వీక్లీ, ఈస్ట్రన్ ఐ సంస్థలు నిర్వహించిన సర్వేలో ప్రభాస్‌కు భారీగా ఓట్లు పోలయ్యాయి. ఆసియా అత్యంత శృంగార పురుషుడు- 2019 పేరిట ఆన్లైన్లో సర్వే నిర్వహించగా, తాజాగా ఫలితాలు వెల్లడించారు. ఈ లిస్టులో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ మొదటిస్థానంలో నిలిచాడు. టాప్-5లో ఆ తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, టీవీ నటుడు వివియన్ డిసేనా, బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్ ష్రాఫ్, బ్రిటీష్ ఏషియన్ పాప్ స్టార్ జయన్ మాలిక్ నిలిచారు. ఇక సినిమాలకు సంబంధించిన ప్రముఖులే ఎక్కువగా ఉన్న టాప్-10లో ఏకైక క్రీడాకారుడు విరాట్ కోహ్లీనే. కోహ్లీకి 7వ స్థానం లభించింది.













