ప్రధాని మోదీకి ప్రభాస్ మద్దతు
ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో భాగంగా స్వచ్ఛత హై సేవ విప్లవానికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించాడు. దేశాన్ని శుభ్రంగా ఉంచడం ఒక పనిగా కాకుండా అలవాటుగా మార్చుకుంటానని ఆయన ప్రతిజ్ఞ పూనాడు. ఇటీవల క్లీన్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా స్వచ్చ్ భారత్ అవశ్యకతను ప్రచారం చేయాలని కొంతమంది ప్రముఖులకు ప్రధాని మోదీ వ్యక్తిగతంగా లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై స్పందిస్తూ స్వచ్ఛత కోసం పాటుపడిన మహాత్మగాంధీ జయంతి త్వరలో రానుంది. ఆ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని స్వచ్ఛతను, పచ్చదానికి నా వంతు ప్రచారం కల్పించడానికి కృషి చేస్తాను అని ప్రభాస్ ఫేస్బుక్లో ఫోస్ట్ చేశారు. ఇప్పటికే రజనీకాంత్, రాజమౌళితో పాటు మరికొంత మంది ప్రముఖులు పధాని లేఖకు స్పందిస్తూ తమ మద్దతును ప్రకటించిన సంగతి విదితమే.













