Prabhas: రాజా సాబ్ ను పూర్తి చేసేసిన డార్లింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా రాజా సాబ్(raja saab), ఫౌజీ(fauji) సినిమాలను ఒకేసారి చేస్తున్న ప్రభాస్ తాజాగా రాజా సాబ్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభాస్ ఎప్పుడో ఈ షూటింగ్ ను పూర్తి చేయాల్సింది కానీ మధ్యలో హెల్త్ ఇష్యూస్ కారణంగా షూటింగ్ డిలే అయింది.
ఆల్రెడీ రాజా సాబ్ షూటింగ్ ను పూర్తి చేసిన ప్రభాస్, ఇకపై తన ఫోకస్ ను హను రాఘవపూడి(hanu raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ(fauji) తో పాటూ సందీప్ రెడ్డి వంగా(sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్(spirit) పై పెట్టనున్నాడని, త్వరలోనే డార్లింగ్ స్పిరిట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లో ప్రభాస్ సమాంతరంగా పాల్గొననున్నాడని సమాచారం.
ఫౌజీ మూవీ మొదలై ఇప్పటికే చాలా కాలమవుతున్న నేపథ్యంలో త్వరలోనే ఫౌజీని కూడా పూర్తి చేసి ఆ తర్వాత కేవలం స్పిరిట్ కోసమే ప్రభాస్ టైమ్ ను కేటాయించనున్నాడని, స్పిరిట్ మూవీ పూర్తయ్యాక కల్కి2(kalki2), సలార్2(salaar2) సినిమాలను చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. అయితే జనవరి 9న ప్రభాస్ నుంచి రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.







