ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్ ఏంటో?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటంగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సగానికి పైగా పూర్తైనట్లు సమాచారం. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రాజా సాబ్ టీమ్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సారైనా రాజా సాబ్ నుంచి టీజర్ ను రిలీజ్ చేస్తే బావుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మారుతి ఏం సర్ప్రైజ్ ఇవ్వనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ ను చాలా రోజుల తర్వాత డిఫరెంట్ గెటప్‌లో మాస్ యాంగిల్ లో చూపించబోతున్న మారుతి ఇవ్వనున్న సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది.
రూ. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ నమోదు చేస్తుందని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న రాజా సాబ్ కోసం తెలుగు ప్రేక్షకులతో పాటూ హిందీ ఆడియన్స్ కూడా ఎంతో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.













