అమెరికాలో ప్రభాస్ తో పాటూ రానా
ఆదిపురుష్ సినిమాతో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ప్రభాస్, ప్రస్తుతం చేస్తున్న బిగ్గెస్ట్ సినిమాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతీ బ్యానర్ లో వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా గురించి ప్రభాస్ ఎంతో చాలా వెయిట్ చేస్తున్నట్లు రీసెంట్గా తన ఇన్స్టా పోస్ట్ లో తెలిపాడు.
ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె మూవీ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొంటున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 20న ఈ ఈవెంట్ అమెరికాలో జరగనుంది. ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కె టీమ్ మొత్తం పాల్గొననుంది. శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ కి హాజరు కానున్న మొదటి ఇండియన్ ఫిల్మ్ గా ప్రాజెక్ట్ కె రికార్డుకెక్కింది.
ఈవెంట్ టైమ్ దగ్గర పడుతుంటడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ అమెరికా చేరుకుంటుంది. ప్రభాస్ ఆల్రెడీ అమెరికాలోనే ఉన్నాడు కాబట్టి ఆ ఈవెంట్ అయ్యాకే తిరిగి ఇండియా వస్తాడు. అయితే ఇప్పుడు శాన్ డియగో కామిక్ కాన్ ఈవెంట్ కోసం ప్రభాస్ తో పాటూ రానా దగ్గుబాటి కూడా అక్కడికి వెళ్లినట్లు విజయంతీ మూవీస్ వారిద్దరి ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ అమెరికాలో ల్యాండ్ అయ్యారంటూ క్యాప్షన్ పెట్టింది. కాగా ప్రాజెక్ట్ కె లో అమితాబ్, దీపికా, కమల్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.













