Prabhas: నాగి ఎప్పుడూ ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాడు
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు ఎంతోమంది సెలబ్రిటీలు విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రభాస్ కూడా ఓ పోస్ట్ చేశాడు. నాగ్ అశ్విన్ కు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ ఓ స్పెషల్ పోస్ట్ చేసిన ప్రభాస్(Prabhas) అందులో నాగ్ అశ్విన్ పై తన అభిమానాన్ని బయటపెట్టాడు.
ఆ పోస్ట్ లో ప్రభాస్ నాగ్ అశ్విన్ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. కల్కి(Kalki) మూవీలోని సూపర్ కార్ బుజ్జిలో నాగి కూర్చున్న ఫోటోను షేర్ చేసిన ప్రభాస్, ఎంతో అద్భుతమైన నాగికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ దూరదృష్టి, సినిమాలపై నీకున్న డెడికేషన్ నాలో ఎప్పుడూ స్పూర్తిని నింపుతూనే ఉంటాయని, కల్కి2(Kalki2) నువ్వు చేసే మ్యాజిక్ ను చూడ్డానికి ఎంతో ఆతృతగా ఉందని రాసుకొచ్చాడు.
నాగ్ అశ్విన్ ఇప్పటివరకు మూడు సినిమాలే తీసినా ఆ మూడు సినిమాలతో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఎవడే సుబ్రమణ్యం(Yevade Subramanyam) సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్ అశ్విన్, తర్వాత మహానటి(Mahanati) సినిమా తీసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత కల్కి(Kalki) సినిమాతో ఎన్ని సంచలనాలు సృష్టించాడో, ఆ సినిమాతో ఎన్ని రికార్డు క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పే పన్లేదు.






