Pooja Hegde: పార్లే-జి బిస్కెట్లు తింటున్న పూజా

సినీ రంగంలో నటులుగా ఉన్నప్పుడు వాళ్లు ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు చాలానే వస్తుంటాయి. అలాంటప్పుడు వారు ఇంటిని మిస్ అవడం కామన్. ఇంటిపై ఉన్న బెంగను పోగొట్టుకోవడానికి ఒక్కొకరు ఒక్కో దారిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే(pooja hegde) కూడా అలానే తన హోమ్ సిక్ ను అధిగమించడానిక ఓ రెమెడీని కనిపెట్టింది.
పార్లే- జి బిస్కెట్స్ ను వేడి టీ తో కలిపి తింటూ తన హోమ్ సిక్ ను పోగొట్టుకుంటుంది పూజా హెగ్డే. వేడి టీలో బిస్కెట్స్ ను కలిపి తింటూ ఇది తనకెంతో ఇష్టమైన కాంబినేషన్ అని, దానికి సంబంధించిన వీడియోను కూడా పూజా తన ఇన్‌స్టాగ్రమ్ లో షేర్ చేసింది. ప్యాకెట్ లో నుంచి ఓ బిస్కెటను తీసి దీన్ని నా చాయ్ లో ముంచుతున్న అని చెప్పిన పూజా, ఇది చాలా డేంజరస్ స్టఫ్ అని కూడా ఆ వీడియోలో తెలిపింది.
దీంతో పాటూ హోమ్ సిక్ రెమెడీస్ అనే క్యాప్షన్ ను కూడా పూజా ఆ వీడియోకు యాడ్ చేసింది. పూజా చేసిన ఈ పోస్ట్ చూసి ఆమె ఫాలోవర్లు కొందరు హీరోయిన్ అయుండి కూడా పూజా పార్లే- జి బిస్కెట్సే తింటుందని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం పూజా దగ్గర పాపం కాస్ట్లీ బిస్కెట్స్ కొనుక్కునే డబ్బులు కూడా లేవంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. రీసెంట్ గా రెట్రో(retro) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పూజా హెగ్డే, ప్రస్తుతం విజయ్(vijay) సరసన జన నాయగన్(jana nayagan) సినిమాలో నటిస్తోంది.