Pooja Hegde: ఆ హీరోతో కలిసి నటించాలనుంది
ఈ మధ్య హీరోయిన్లు ఏ విషయాన్నీ మనసులో పెట్టుకోవడం లేదు. ఏ విషయాన్నైనా ఓపెన్ గా బయటకు చెప్పేస్తున్నారు. ఇప్పుడు పూజా హెగ్డే(pooja hegde) కూడా అలానే తన మనసులోని విషయాన్ని చెప్పింది. పూజా హెగ్డే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya)తో కలిసి రెట్రో(retro) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది పూజా(pooja).
రెట్రో ఇంటర్వ్యూలో భాగంగా పూజాకు మీకు ఏ తెలుగు హీరోతో కలిసి నటించాలనుందని అడగ్గా దానికి పూజా అసలు ఆలోచించకుండా వెంటనే నాని పేరు చెప్పేసింది. నిన్ను కోరి(ninnu kori) సినిమాలో నాని(nani) యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, నాని యాక్టింగ్ లో ఏదో మ్యాజిక్ ఉందని, అతనితో వర్క్ చేయడం చాలా ఫన్నీగా ఉంటుందని కూడా తాను విన్నానని చెప్పింది పూజా.
తన సహజ నటనతో అందరినీ మెప్పించే నాని తో పూజా స్క్రీన్ షేర్ చేసుకోవాలనుందని చెప్పడం అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. మరి నానితో నటించాలనే పూజా కోరిక త్వరలోనే తీరుతుందా లేదా దాని కోసం అమ్మడు వెయిట్ చేయాల్సిందేనా అనేది చూడాలి. మొన్నటికి మొన్న తమన్నా(tamannaah) కూడా తనకు శర్వానంద్(sarwanand) తో కలిసి వర్క్ చేయాలనుందని చెప్పగా, ఇప్పుడు పూజా నాని పేరు చెప్పింది.






