Pooja Hegde: కన్నడ ఇండస్ట్రీ వైపు పూజా అడుగులు
మూడేళ్ల ముందు వరకు తెలుగులో టాప్ హీరోయిన్ గా చలామణి అయిన పూజా హెగ్డే(pooja hegde)కు వరుస ఫ్లాపుల వల్ల ఆఫర్లు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ కు వెళ్లి అక్కడ తన లక్ ను టెస్ట్ చేసుకుంది. ఇప్పుడు మళ్లీ తిరిగి సౌత్ కు వచ్చి బిజీ అవాలనుకుంటున్న పూజా సూర్య(suriya)తో రెట్రో(retro) సినిమా చేసింది. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. రెట్రో తో పాటూ పూజా(pooja) తమిళంలో పలు సినిమాలు చేస్తోంది.
తమిళ స్టార్ హీరో విజయ్(vijay) తో జన నాయగన్(Jana Nayagan) తో పాటూ రజనీకాంత్(rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో వస్తున్న కూలీ(Coolie)లో స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఇవి కాకుండా తెలుగులో దుల్కర్ సల్మాన్(dulquer salman) తో ఓ లవ్ స్టోరీ చేయబోతుందని వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా రెట్రో ప్రమోషన్స్ లో పూజా కూడా తాను తెలుగులో ఓ ప్రేమ కథ చేయబోతున్నట్టు స్పష్టం చేసింది. అయితే పూజా మాత్రం లవ్ స్టోరీ అని మాత్రమే చెప్పింది అది ఎవరితో అనే విషయం చెప్పలేదు.
మూడేళ్ల తర్వాత మళ్లీ పూజా తెలుగు సినిమాకు సైన్ చేయడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇదిలా ఉంటే పూజా అడుగు ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ వైపు కూడా పడుతుందంటున్నారు. కిచ్చా సుదీప్(kichha sudeep) హీరోగా అనూఫ్ భండారీ(anup bhandari) దర్శకత్వంలో వస్తున్న బిల్లా రంగా బాషా(billa ranga basha) అనే సినిమాలో హీరోయిన్ గా పూజా ఎంపికైందని వార్తలొస్తున్నాయి. ఈ వార్త నిజమైతే పూజాకు కన్నడ డెబ్యూ మూవీ ఇదే కానుంది. అంతే కాదు పూజా కన్నడలో కూడా సినిమా చేస్తే సౌత్ మొత్తాన్ని కవర్ చేసిన హీరోయిన్ గా పూజా నిలుస్తోంది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.






