Pooja Hegde: పల్లెటూరి అమ్మాయిగా ఎట్రాక్ట్ చేస్తున్న పూజా
ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన పూజా హెగ్డే(Pooja Hegde) కొన్నాళ్లుగా ఫామ్ లో లేదు. ఇప్పుడు సూర్య(suriya)తో చేస్తున్న రెట్రో(Retro) సినిమాతో మళ్లీ తన సత్తా చాటడానికి రెడీ అవుతున్న పూజా ఆ సినిమా ప్రమోషన్స్ లో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది. రీసెంట్ గా అమ్మడు లైట్ సీ గ్రీన్ కలర్ లెహంగాలో పల్లెటూరి అమ్మాయిలా కనిపించింది. డ్రెస్సింగ్ కు తగ్గట్టు మెడలో సంప్రదాయ ఆభరణాలు, సింపుల్ హెయిర్ స్టైల్, చేతికి గాజులు వేసుకుని ఎంతో సింపుల్ గా కనిపిస్తూనే స్పెషల్ గా అందరినీ ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం పూజా లుక్స్, స్టైల్ నెట్టింట వైరల్ అయి, అందరూ ఆమె లుక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు













