విశాల్‌కు మరో షాక్
ఆర్కే నగర్ ఉప ఎన్నిక బరిలోకి దిగి, రాజకీయరంగంలోకి అడుగుపెట్టాలని భావించిన హీరో విశాల్ కు అక్కడ నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. అతని నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత విశాల్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికే ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించనని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో రాజకీయ బరిలోకి దిగుతానని తెలిపాడు. ఈ నేపథ్యంలో తాజాగా విశాల్‌కు మారో షాక్ తగిలింది. నడిగర్ సంఘం వైస్ ప్రెసిడెంట్ పదవికి తమిళ నటుడు పొన్ వన్నన్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణావల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే పోన్ వన్నన్ రాజీనామా చేయడం వ్యక్తిగతంగా విశాల్‌కు పెద్ద దెబ్బేనని కోలీవుడ్ టాక్. ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో పోన్ వన్నన్ కీలకమైన వ్యక్తి కావడమే దీనికి కారణం.













