తలైవాకు ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు
తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. అలాగే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రజనీకి బర్త్‌డే విషెస్ తెలిపారు. ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అద్భుతంగా జీవించాలని, రాజకీయాల్లో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీ ప్రత్యేక శైలి ద్వారా ఎన్నో మిలియన్ల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రత్యేక స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.













