Peddi: పెద్ది నెక్ట్స్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
గేమ్ ఛేంజర్(game changer) మూవీ డిజాస్టర్ అవడంతో రామ్ చరణ్(ram charan) తన ఆశలన్నింటినీ త్వరలోనే రాబోతున్న పెద్ది(peddi) సినిమాపైనే పెట్టుకున్నాడు. ఉప్పెన(uppena) డైరెక్టర్ బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. చరణ్ తో పాటూ బుచ్చిబాబు కూడా ఈ ప్రాజెక్టును ఎంతో ప్రిస్టీజియస్ గా తీసుకున్నాడు. ఈ ప్రాజెక్టుతో ఎట్టి పరిస్థితుల్లో టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోవాలని బుచ్చి ప్లాన్.
అందులో భాగంగానే పెద్ది సినిమాను బుచ్చిబాబు నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్(janhvi kapoor) ను ఎంచుకున్న బుచ్చిబాబు, మ్యూజిక్ కోసం ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) ను రంగంలోకి దింపారు. ఆల్రెడీ పెద్ది నుంచి రిలీజైన చికిరి(chikiri) సాంగ్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పాటూ ఆ సాంగ్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది.
చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పెద్ది నుంచి నెక్ట్స్ సాంగ్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, వేలెంటైన్స్ డే కానుకగా పెద్ది సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్న్టటు తెలుస్తోంది. ఈ రెండో పాట మాస్ సాంగ్ గా ఉండనుందని అంటున్నారు. మరి ఈ సాంగ్ రిలీజ్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













