Peddi: ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో చికిరి సాంగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, (Ram Charan)అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్(A R Rehaman) కాన్సర్ట్ లో సందడి చేశారు. రెహమాన్ కాన్సర్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. అతిథులుగా హాజరైన రామ్‌చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సానా ఆడియన్స్ లో మరింత జోష్ నింపారు. ‘పెద్ది’ సినిమాలోని చికిరి చికిరి లైవ్ పెర్ఫామెన్స్ ని ఆడియన్స్ నుంచి అద్భుతమై రెస్పాన్స్ వచ్చింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. రెహమాన్ గారి సంగీతంలో భాగమవ్వాలనేది నా చైల్డ్‌హుడ్ డ్రీం. అది నా ప్రాజెక్ట్ ‘పెద్ది’ తో నెరవేరినందుకు చాలా ఆనందంగా వుంది.
జాన్వి కపూర్ మాట్లాడుతూ.. పెద్ది సినిమాలో భాగమయ్యే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మా ఫస్ట్ సింగిల్ మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాతో మీకు ఒక డిఫరెంట్, యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం.
చికిరి పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మొత్తం 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో వుంది.
పాట విడుదలైనప్పటి నుండి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కొత్త రికార్డ్స్ నెలకొల్పుతోంది. రెహమాన్ స్వరపరిచిన చికిరి చికిరి ఎమోషన్స్, మాస్ అప్పీల్ తో చేసే ఆడియో-విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. బాలాజీ అద్భుతమైన సాహిత్యం, మోహిత్ చౌహాన్ మ్యాజికల్ వోకల్స్ తో సాంగ్ దేశంలోని ప్రతి మూల నుండి ప్రేక్షకులకు ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యింది. రామ్ చరణ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రజెన్స్ తో చికిరి వైరల్ తుఫాను గా మారింది. రూరల్ బీట్స్, ఎనర్జిటిక్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్, రామ్ చరణ్ మాస్ ఇమేజ్ తో “చికిరి చికిరి” పాట అదిరిపోయింది.
మొదటి 24 గంటల్లోనే “చికిరి చికిరి” యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. దేశవ్యాప్తంగా టాప్ చార్ట్స్‌లో నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. నాలుగు భాషల్లో కలిపి 53 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించింది. అంతకుముందు 13 గంటల్లోనే 32 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియా రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు మిలియన్ లైక్స్‌తో అభిమానుల ప్రేమని అందుకుంది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్, డాన్స్ చాలెంజ్‌లు, ఫ్యాన్ ఎడిట్స్.. ఎక్కడ చూసినా “చికిరి చికిరి” మ్యూజిక్ ఫీవర్‌నే కనిపిస్తోంది. రామ్ చరణ్ మాస్ మాగ్నటిజం, ఏఆర్.రహ్మాన్ మ్యూజిక్ మ్యాజిక్ కలసి భాషా, ప్రాంతీయ హద్దులు దాటి ఓ మ్యూజికల్ ఫెనామెనాన్గా మారాయి.
డైరెక్టర్ బుచ్చి బాబు సాన తన మ్యూజిక్ సెన్సిబిలిటీస్, విజువల్ సెన్స్‌ను ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతంగా చూపించారు. వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమా బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పెద్ది 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.







