Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వెనక్కి ఇచ్చేస్తున్నాడా?
ప్రస్తుతం పవన్(pawan) రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాల కోసం తగిన టైమ్ కేటాయించలేక పోతున్నాడు. తన దృష్టంతా రాజకీయాలపైనే ఉండటంతో కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి కూడా పవన్ కు కుదరడం లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులుండగా వాటన్నింటిలో ముందు స్టార్ట్ అయిన సినిమా హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu).
ఈ సినిమా నిర్మాణంలోనే నాలుగేళ్లకు పైగా ఉంది. ఎక్కువ కాలం ప్రొడక్షన్ లోనే ఉండటం వల్ల నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam)కు బడ్జెట్ భారీగా పెరిగింది. పోనీలే ఇప్పటికైనా సినిమా రిలీజవుతుందనుకుంటే జూన్ 12 నుంచి కూడా వీరమల్లు వాయిదా పడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో నిర్మాతకు ఇంకా భారంగా మారింది. మరోసారి వాయిదా పడటంతో నిర్మాతకు ఆ ఖర్చు ఇంకా పెరిగే అవకాశముంది.
అయితే నిర్మాత కష్టాన్ని, నష్టాన్ని గమనించిన పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేన్ లో భాగంగా తీసుకున్న రూ.11 కోట్ల అడ్వాన్సును తిరిగి ఇవ్వాలని భావిస్తున్నారట. వాస్తవానికి పవన్ ఒక్కో సినిమాకు రూ.75 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడు కానీ వీరమల్లు కోసం రూ.50 కోట్లకే డీల్ కుదుర్చుకుని అందులో రూ. 11 కోట్లు అడ్వాన్సు తీసుకోగా, ఇప్పుడా అడ్వాన్సు కూడా పవన్ తిరిగి ఇస్తుండటంతో నిర్మాత రత్నంకు పెద్ద ఊరట లభించే అవకాశముంది.






