థమన్ ని మర్చిపోయిన పవన్
పవన్ కళ్యాణ్ ఆల్బమ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. మణిశర్మ, రమణ గోగుల లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు పవన్ కి మంచి పాటలిచ్చారు. ఆ తర్వాత దేవీ శ్రీ, అనూప్, రీసెంట్గా థమన్ మంచి మ్యూజిక్ ఇస్తూ వచ్చారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఇప్పుడు బ్రో సినిమాలకు వరుసగా మ్యూజిక్ ఇస్తున్న థమన్, వకీల్ సాబ్ లో మహిళల కోసం కంపోజ్ చేసిన మగువా సాంగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కు కూడా థమన్ మంచి సాంగ్స్ తో పాటూ అదిరిపోయే రీరికార్డింగ్ అందించాడు. ఇలా థమన్ వరుసగా పవన్ కు మూడు సినిమాలు చేయడం గ్రేట్ అనే చెప్పాలి. అయితే థమన్ గత రెండు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడన్న విషయం పవన్ మర్చిపోయాడు.
రీసెంట్గా జరిగిన బ్రో ఈవెంట్లో కొందరు తెలియని టెక్నీషియన్ల పేర్లు రాసుకుని మరీ వారి గురించి థాంక్స్ చెప్పిన పవన్, థమన్ పేరు చూసి వకీల్ సాబ్ మ్యూజిక్ మీరే కదా అని అడగడమే కాదు భీమ్లా నాయక్ కూడా మీరేనా అని అడిగి, చివర్లో మనది హ్యాట్రిక్ అంటూ థాంక్స్ చెప్పి కవర్ చేసుకున్నాడు. తనతో వరుసగా మూడు సినిమాలు చేసిన థమన్ను పవన్ మర్చిపోవడం అందరికీ షాకిచ్చింది.













