ఫ్యాన్స్‌ని శాటిస్ఫై చేస్తున్న పవన్
2019 ఎలక్షన్స్ టైమ్ లో పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు అనౌన్స్ చేయడం ఆయన ఫ్యాన్స్ అందరికీ ఎంతో పెద్ద షాక్ నిచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటూ తిరిగి సినిమాలు చేయాలనుకోవడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత పవన్ రీ ఎంట్రీ వల్ల హ్యాపీనే కానీ ఆయన చేస్తున్న సినిమాల పట్ల ఫ్యాన్స్ లో చాలా నిరాశ కలిగింది.
ఫ్యాన్స్ కు కావాల్సిన సినిమాలు చేయట్లేదని, మాస్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు కాకుండా వరుస పెట్టి రీమేక్స్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. పింక్ సినిమాతో పవన్ రీఎంట్రీ ఏంటి అనుకున్నారంతా. ఆ సినిమా చేయడం కంటే సినిమాలను విరమించుకోవడమే బెటర్ అన్న వాళ్లూ ఉన్నారు. కానీ వకీల్ సాబ్ రిలీజ్ టైమ్ కు సీన్ మొత్తం మారిపోయింది.
ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ విషయంలో కూడా ఫ్యాన్స్ ఇలాగే నిరాశ చెందారు. మళ్లీ రీమేకా? అది కూడా అలాంటి సినిమానా అని బాధ పడ్డారు కానీ చివరకు ఆ సినిమాను కూడా బాగా ఓన్ చేసుకున్నారు. సినిమా కూడా ఫ్యాన్స్ ను శాటిస్ఫై చేసింది. ఇక రీసెంట్గా వినోదాయ సీతం రీమేక్ విషయంలో కూడా పవన్ ఫ్యాన్స్ ఆ సినిమా వద్దంటే వద్దని గోల చేశారు.
కానీ సినిమా పట్టాలెక్కి, షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు సైలెంట్ అయ్యారు. బ్రో అని టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలొచ్చినప్పుడు ఇదేం టైటిల్ అన్నారు కానీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూశాక ఒరిజినల్ కంటే ఇది బాగుందనిపించి ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే ఫ్యాన్స్ ఈ సినిమాను కూడా ఓన్ చేసుకున్నట్లే అనుకోవాలి. ఏదైనా సరే ఫ్యాన్స్ ముందు వద్దన్న దాంతోనే మెప్పించడం పవన్ కే సాధ్యమవుతుంది.













